మహిపాల్ తాండ పాఠశాలకు గ్రీన్ బోర్డు విరాళం
సిరికొండ, ఆంధ్రప్రభ: సిరికొండ మండలం జగదాంబ తాండ గ్రామపంచాయతీ పరిధిలోని మహిపాల్ తాండ ప్రాథమిక పాఠశాలకు సామాజిక సేవకుడు గోపాల్ నాయక్ శుక్రవారం గ్రీన్ బోర్డు, విద్యా చార్టులను అందజేశారు. ఈ విషయాన్ని జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రవి నాయక్ తెలిపారు.
పాఠశాలలో గ్రీన్ బోర్డు లేక ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న గోపాల్ నాయక్, చిన్నారులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఈ విద్యా సామగ్రిని అందజేసినట్లు రవి నాయక్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుగుణ, మహిపాల్ తాండ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మగ్బుల్, అంగన్‌వాడీ టీచర్ సమీల తదితరులు పాల్గొన్నారు.
