Narendra Modi | ఆపరేషన్ సింధూర్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు

ప్రపంచాన్ని కుదిపిన భారత దాడులు

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్: భారత రక్షణ వ్యవస్థల సామర్థ్యం, విశ్వసనీయతను ప్రపంచం ప్రత్యక్షంగా చూసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో నిర్వహించిన ప్రవాస భారతీయుల సమావేశంలో ఆయన ‘ఆపరేషన్ సింధూర్’ను ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘ఆపరేషన్ సింధూర్’ సందర్భంగా భారత రక్షణ సామర్థ్యం ఎలా పనిచేసిందో ప్రపంచం గమనించిందని ప్రధాని పేర్కొన్నారు. ఉగ్రవాదుల స్థావరాలపై జరిగిన దాడులు భారత సైనిక శక్తికి నిదర్శనమని అన్నారు.

“ఉగ్రవాదుల స్థావరాల్లో పేలుళ్లు జరిగాయి. అయితే వాటి ప్రతిధ్వనులు ప్రపంచమంతటా వినిపించాయి. భారత రక్షణ వ్యవస్థల సామర్థ్యం, విశ్వసనీయతను ప్రపంచ దేశాలు ప్రత్యక్షంగా చూశాయి” అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా, “ఉగ్రవాద స్థావరాలపై జరిగిన ఈ భారీ దాడి మీకు గర్వాన్ని కలిగించిందా లేదా?” అని అక్కడికి హాజరైన ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రశ్నించారు. ప్రధాని వ్యాఖ్యలకు సభలో పాల్గొన్న వారు హర్షధ్వానాలతో స్పందించారు.