Ghat road | భాకరాపేట ఘాట్‌లో భారీగా ట్రాఫిక్ జామ్

Ghat road | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తిరుపతి జిల్లా భాకరాపేట ఘాట్ రోడ్డులో టమోటా లోడ్‌తో వెళ్తున్న మినీ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలోని టమోటా బాక్సులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.

అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి తిరుపతి మార్కెట్‌కు టమోటా లోడ్‌ను తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో లారీ క్యాబిన్ తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ డ్రైవర్, క్లీనర్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

ఘటనతో ఘాట్ రోడ్డుపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.