నిత్య అన్నదాన పథకానికి విరాళం

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొలువైయున్న కనకదుర్గమ్మ వారి ఆలయంలో నిత్యం నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి రూ.1,25,,000/- విరాళమును విజయవాడ మధుర నగర్ ప్రాంతానికి చెందిన దాత కే కిషోర్ కుమార్, కుటుంబీకులు పేరు అందజేశారు.

ఈ విరాళమును ఆలయ ఆలయ చైర్మన్ రాధాకృష్ణ (గాంధీ) సమక్షంలో భక్తిపూర్వకంగా అందజేశారు. వీరికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేయగా వేద పండితులు వేద ఆశీర్వచన అనంతరం దుర్గగుడి పాలకమండలి చైర్మన్ బుర్ర గాంధీ అమ్మవారి చిత్రపటం రసీదు, ప్రసాదాలను అందజేశారు.