ఆర్యవైశ్య సంఘం నాయకులతో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సమావేశం
సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చ
ఆర్యవైశ్యుల సంక్షేమానికి సహకారం అందిస్తామని హామీ
నరసరావుపేట, ఆంధ్రప్రభ: పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు బుధవారం గుంటూరులోని తన కార్యాలయంలో ఆర్యవైశ్య సంఘం ముఖ్య నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు.
ఆర్యవైశ్య సంఘం నాయకులు తమ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు, అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. నాయకులు వివరించిన సమస్యలను విన్న లావు శ్రీకృష్ణదేవరాయలు వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. ఆర్యవైశ్యుల సంక్షేమం, అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు అత్తులూరి సుబ్బారావు, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు కంభంపాటి అనిల్, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు పాండురంగ శ్రీను, చిలకలూరిపేట మాజీ కౌన్సిలర్ కనమర్లపూడి రమేష్, రాజుపాలెం మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ భవనాశ్రీ కిషోర్, కారంపూడి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఎస్పీఆర్ కృష్ణ, టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి చౌట శ్రీనివాసరావుతో పాటు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
