బదిలీపై వెళ్తున్న ఏఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ లకు సన్మానం

​చిట్యాల, ఆంధ్రప్రభ: మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించి, బదిలీపై వెళ్తున్న ఏఎస్ఐ, కానిస్టేబుల్ లకు మంగళవారం తోటి సిబ్బంది శాలువాలతో సన్మానించి , వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పోచం పల్లి సతీష్, రెండవ ఎస్సై రాజన్ కుమార్ పాల్గొన్నారు.​ బదిలీపై వెళ్తున్న ఏఎస్ఐ మధుసూదన్, కానిస్టేబుల్ అస్లాం జానీ, మహిళా కాని స్టేబుళ్లు మమత, లలిత లను ఎస్ఐలు, తోటి పోలీస్ సిబ్బంది శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.

అనంతరం ఎస్ఐ పోచంపల్లి సతీష్ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో బదిలీలు అనేవి సర్వీసులో అత్యంత సహ జమైన ప్రక్రియ అని పేర్కొ న్నారు.​ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుళ్లు సురేందర్, రామకృష్ణ, కానిస్టేబుళ్లు రంజి త్, లాల్ సింగ్, క్రాంతి, సందీ ప్, నాగరాజు, మహిళా కాని స్టేబుళ్లు నాగమణి, మమత, శ్రావణి, స్వాతి తదితరులు పాల్గొన్నారు.