ఎరుకుల సంఘం కేసముద్రం మండల కమిటీ ఎన్నిక

కేసముద్రం, ఆంధ్రప్రభ: తెలంగాణ ప్రదేశ్ ఎరుకుల సంఘం రాష్ట్రఅధ్యక్షులు కూతడి కుమర్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు పేరం విరస్వామి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రదేశ్ ఎరుకుల సంఘం కేసముద్రం మండల కమిటీ ఎన్నుకోవడం జరిగింది. కేసముద్రం మండల అధ్యక్షులుగా కట్ల పాపయ్య, ఉపాధ్యక్షులుగా కట్ల వెంకన్న, ప్రధాన కార్యదర్శిగా కోనేటి సంపత్ ను ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యఅతిథులుగా పాల్గొన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు కేతిరి ఉప్పలయ్య మాట్లాతు మహబూబాబాద్ జిల్లాలో ఏకలవ్య కూస్థులను ఏకథటి పై తీసుకోని వచ్చి అందరికి మన హక్కు లను తెలియచేస్తూ మన కులస్థులకు న్యాయం జరిగేలా చూడాలని తెలిపారు. అనంతరం నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన కట్ల పాపయ్య మాట్లాడుతూ తన పై ఎంతో నమ్మకంతో ఈ పదవిని అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు కూతటి కుమార్, ఉపాధ్యక్షులు కేతిరి ఉప్పలయ్య, జిల్లా అధ్యక్షులు పేరం వీరస్వామితో పాటుగా ప్రధాన నాయకులకు ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

సంఘం బలోపేతానికి ఎటువంటి బేషజాలు లేకుండా నా తోటి సంఘం నాయకులను కలుపుకొని కృషి చేస్తానని ఈ సందర్భంగా పాపయ్య తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎరుకల సంఘం రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షులు రాయపురం సంపత్, జిల్లా ప్రధాన కార్యదర్శి పేరం బక్కయ్య, జిల్లా సహాయ కార్యదర్శి కుంభం మహేష్,జిల్లా యూత్ ఉపాధ్యక్షులు గుతుప విజేందర్, ఇనుగుర్తి మండల అధ్యక్షులు మాదగని ఉప్పలయ్య, ఇనుగుర్తి మండల ప్రధాన కార్యదర్శి గుతుప యాకయ్య, కేసముద్రం విలెజ్ మాజీ సర్పంచ్ గుతుప రమేష్, కేసముద్రం విలెజ్ కుల పెద్ద మనిషి మాదగని వెంకన్న , ఎరుకల కుల బంధువులు పాల్గొన్నారు.