ఎస్ ఐ ఆర్ సర్వేకు ఓటర్లు సహకరించాలి..

లింగాపూర్ సర్పంచ్ కుమ్మరి రంజిత్

కడెం, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వ ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ సర్వేకు ఓటర్లు ప్రజలు సహకరించాలని లింగాపూర్ గ్రామ సర్పంచ్ కుమ్మరి రంజిత్ కుమార్ అన్నారు కడెం మండలంలోని లింగాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో జిపి పరిధిలోగల ఓటర్ల ఎస్ ఐ ఆర్ ఫారములు నింపడానికి ప్రత్యేకంగా ఐదుగురు యువకులను నియమించి దరఖాస్తు ఫారాలు పూర్తి చేయడానికి స్థానిక సర్పంచ్ కుమ్మరి రంజిత్ కుమార్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు బేగం ఈ సందర్భంగా ఎస్ ఐ ఆర్ సర్వే ఓటర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కమ్ముల లక్ష్మీ స్వామి జిపి వార్డు సభ్యులు స్థానిక పంచాయతీ కార్యదర్శి వై రాజు గ్రామస్తులు పాల్గొన్నారు.