కంచరపాలెం హైవేపై తప్పిన పెను ప్రమాదం
డివైడర్‌ను ఢీకొట్టిన ద్రాక్ష లోడ్ వాహనం..
సురక్షితంగా బయటపడ్డ దంపతులు
కంచరపాలెం (ఆంధ్రప్రభ): కంచరపాలెం హైవేపై ద్రాక్ష పండ్ల లోడ్‌తో వెళ్తున్న టాటా ఏస్ వాహనం అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో డ్రైవర్‌తో పాటు ఆయన భార్య ఉండగా, అదృష్టవశాత్తూ ఇద్దరూ ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు.
సమాచారం అందుకున్న కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాన్ని రహదారి పక్కకు తొలగించారు. అనంతరం ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.
ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు విచారణ చేపట్టారు.
