టాటా మ్యాజిక్‌ను ఢీకొన్న కారు

  • పలువురు మహిళలకు గాయాలు

కంకిపాడు, ఆంధ్రప్రభ : కంకిపాడు మండలం దావులూరు టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు మహిళలు గాయపడ్డారు. టోల్‌ప్లాజా వద్ద ఆగి ఉన్న టాటా మ్యాజిక్ వ్యాన్‌ను మచిలీపట్నం నుంచి అతివేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో వ్యాన్‌లో ఉన్న పలువురు మహిళలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న టోల్‌ప్లాజా సిబ్బంది క్షతగాత్రులను టోల్‌ప్లాజా అంబులెన్స్‌లో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న కంకిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.