సర్ లో క్రియాశీలకంగా వ్యవహరించాలి

తొర్రూరు, ఆంధ్రప్రభ: భారత ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన జనాభా గణన ప్రక్రియలో బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తమ తమ గ్రామాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని బీఆర్ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు సూచించారు. సోమవారం మండలంలోని గోపాలగిరి,చెర్లపాలెం, చీకటాయపాలెం గ్రామాల్లో పార్టీ నాయకులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “సర్” లో జనాభా గణనలో భాగంగా ఓటును కూడా సురక్షితంగా ఉండునట్లు చూసుకోవాలని, లేనిచో రేషన్ కార్డు పోవడం కానీ, పాస్ పోర్ట్ పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోవడం లాంటి ఎన్నో సమస్యలబారిన పడే అవకాశం ఉన్నందున నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఈ నెల 24 వరకు ఈ నమోదు కార్యక్రమం ఉంటుందని, అందువల్ల బీఎల్వో ల నుండి జనాభా గణన ఫారంను సాధ్యమైనంత త్వరగా తీసుకొని దానిని బాగా తెలిసిన వారితో పూర్తి చేయించుకొని ఇచ్చిన రెండు ఫారాలలో ఒకటి బీఎల్వో కు ఇచ్చి మరొక దానిని రిసీవ్డ్ కాపీ కింద బీఎల్వో చేత సంతకం చేయించుకొని ఎవరిది వారు జాగ్రత్తపరచుకోవాలని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పార్టీ ఇంచార్జులు రాయిశెట్టి వెంకన్న, దొనికెన కుమారస్వామి, పులి వెంకన్న, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.