కాంగ్రెస్ పార్టీ మండల, మున్సిపాల్ అధ్యక్షుల ఎన్నిక..
ఆమనగల్లు, ఆంధ్రప్రభ: కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి, మాడుగుల మండలాలకు నూతన కాంగ్రెస్ అధ్యక్షులను నియమించినట్లు ఆమనగల్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ తెలిపారు.
సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రతిపాదనల మేరకు, డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి సిఫారసుతో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.
ఆమనగల్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోలేపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఆమనగల్లు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జేఏసీ చైర్మన్ అవ్వారి శివలింగం, కడ్తాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా అన్నాస్‌పల్లి మాజీ సర్పంచ్ పోతుగంటి శంకర్, మాడుగుల మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా బట్టు కిషన్ రెడ్డి, తలకొండపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా లింగరావుపల్లి సర్పంచ్ కాసు శ్రీనివాస్ రెడ్డిని నియమించినట్లు పేర్కొన్నారు.
నూతనంగా నియమితులైన మండల కాంగ్రెస్ అధ్యక్షులు కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అవ్వారి శివలింగం, కాసు శ్రీనివాస్ రెడ్డి, బట్టు కిషన్ రెడ్డి, పోతుగంటి శంకర్‌ను కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అభినందించి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
