NEWS@06:00 P.M | 6 జూలై 2026 ముఖ్యాంశాలు
భారత్కు జపాన్ టెక్నాలజీ..
భారత్ – జపాన్ దేశాలు రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు వేసాయి. జపాన్ అభివృద్ధి చేసిన UNICORN (Unified Complex Radio Antenna) సిస్టమ్ ఆధారంగా నౌకాదళ రేడియో యాంటెన్నాను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. Click here to read the full news.
పశువుల కాపరిపై సింహం దాడి
గుజరాత్లోని గిర్ ప్రాంతంలో ఓ ఆడ సింహం పశువుల కాపరిపై దాడి చేసిన ఘటన కలకలం రేపింది. భావ్నగర్ జిల్లా పలితానా పరిధిలోని గర్జియా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకోగా, దానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. Click here to read the full news.
హిందూ మహాసముద్రంలో భారత్కు మరింత బలం..
భారతదేశ రక్షణ రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపుదిద్దుకున్న అత్యాధునిక స్టీల్త్ ఫ్రిగేట్ (శత్రువుల రాడార్లకు చిక్కని యుద్ధనౌక) ‘మహేంద్రగిరి’ (F38) భారత నౌకాదళంలోకి చేరడానికి సిద్ధమైంది. జూలై 11న (శనివారం) విశాఖపట్నంలో జరగనున్న అధికారిక కార్యక్రమంలో ఈ యుద్ధనౌకను రక్షణ రంగ సేవల్లోకి ప్రవేశపెట్టనున్నారు. Click here to read the full news.
మరికొన్ని రైళ్ల రీషెడ్యూల్
మధ్య రైల్వే పరిధిలో కురుస్తున్న భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల నేపథ్యంలో దక్షిణ తీర రైల్వే పలు రైళ్ల మార్గాలను మార్చడంతో పాటు కొన్ని రైళ్లను మధ్యలోనే నిలిపివేయడం, మరికొన్నింటి ప్రారంభ స్టేషన్లలో మార్పులు చేయడం, ఒక రైలును రీషెడ్యూల్ చేసినట్లు విజయవాడ డివిజన్ అధికారులు ప్రకటించారు. Click here to read the full news.
బండి భగీరథ్ బెయిల్పై తీర్పు రిజర్వ్
పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో ఇవాళ సుదీర్ఘ వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. Click here to read the full news.
లెనిన్ కోసం రంగంలోకి ఎన్టీఆర్
అక్కినేని అఖిల్ ‘లెనిన్’ చిత్రంపై అంచనాలు మరింత పెంచే వార్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నచిత్రంపై మేకర్స్ మరో ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. Click here to read the full news.
ముగ్గురు అదనపు జడ్జీల ప్రమాణం
ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో అదనపు న్యాయమూర్తులుగా సునీత గంధం,ఆలపాటి గిరిధర్,పురుషోత్తమ్ కుమార్ చింతలపూడి అలియాస్ సీహెచ్ పురుషోత్తమ కుమార్ లు సోమవారం ప్రమాణం చేశారు. Click here to read the full news.
రైతులకు భారీ నష్టం
అన్నమయ్య జిల్లాలో ఏనుగుల సంచారం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కేవీ.పల్లి మండలంలోని పలు గ్రామాల వ్యవసాయ పొలాల్లోకి రాత్రి ఎనిమిది ఏనుగుల గుంపు చొరబడి బీభత్సం సృష్టించింది. Click here to read the full news.
