అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు దుస్తుల పంపిణీ..
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మండలంలోని బాబాపూర్ గ్రామంలో సోమవారం అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు ఉచితంగా దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సమీర్ హాజరై పాఠశాల ప్రధానో పాధ్యాయుడు ఎడ్ల శేఖర్ తో కలిసి విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ,చిన్నారుల ఆరోగ్యం, పరిశుభ్రత, నాణ్యమైన ప్రాథమిక విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలని గ్రామ ప్రజలకు సూచించారు.
అంగన్‌వాడీ కేంద్రాలు చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి అర్హ కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.చిన్నారులు ప్రతిరోజూ అంగన్‌వాడీ కేంద్రాలకు హాజరై పోషకాహారంతో పాటు ప్రాథమిక విద్యను అభ్యసించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మంద గోవర్ధన్,పంచాయతీ కార్యదర్శి సంతోష్,పాలకవర్గ సభ్యులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
