పిప్రి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ..

పిప్రి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ..

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మండలంలోని పిప్రి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజన పథకం అమలును గ్రామ సర్పంచ్ ఆరిగేల జనార్దన్ ఆకస్మికంగా పరిశీలించారు. వంటశాలను సందర్శించి, విద్యార్థులకు సిద్ధం చేస్తున్న ఆహారం నాణ్యతను పరిశీలించి వంట ప్రక్రియను తనిఖీ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణ, వంటశాల పరిసరాల్లో పరిశుభ్రత, శుభ్రత నిర్వహణను ప్రత్యేకంగా పరిశీలించారు. విద్యార్థులకు పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందించడంతో పాటు పాఠశాల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు ఈరోజు నుంచి ఉదయం టిఫిన్‌తో పాటు పోషకాహారమైన రాగి జావ అందించడం ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామ కార్యదర్శి జితేందర్ తదితరులు పాల్గొన్నారు.