స్టేషన్ ఘన్ పూర్ లో కేటీఆర్ కు ఘన స్వాగతం

చిలుపూర్, ఆంధ్రప్రభ : కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు స్టేషన్ ఘన్పూర్ లో మాజీ ఎమ్మెల్యే డా.రాజయ్య ఆధ్వర్యంలో ఆదివారం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రాజయ్య పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించగా, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు.