ఎయిర్టెల్ సేవలకు అంతరాయం..
- వినియోగదారుల తీవ్ర ఆందోళన..
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఎయిర్టెల్ మొబైల్ నెట్వర్క్ సేవలు నిలిచిపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిగ్నల్ పూర్తిగా లేకపోవడంతో ఫోన్ కాల్స్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.
విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, ఆన్లైన్ సేవలపై ఆధారపడే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
అత్యవసర సమయంలో కూడా ఫోన్ కాల్స్ చేయలేకపోవడం వల్ల ప్రజలు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై పలువురు వినియోగదారులు ఎయిర్టెల్ కస్టమర్ కేర్‌కు ఫిర్యాదులు చేసినప్పటికీ, సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందనే విషయంపై స్పష్టమైన సమాచారం అందలేదని పేర్కొన్నారు. ఎల్కతుర్తి ప్రాంతంలో ఎయిర్టెల్ నెట్వర్క్ సేవలను వెంటనే పునరుద్ధరించి, భవిష్యత్తులో ఇలాంటి అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు సంస్థ అధికారులను కోరుతున్నారు.
