గురుకుల ఇంటర్ ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు..
ఆంధ్రప్రభ, వికారాబాద్ : సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో ఇంటర్ ప్రవేశాల కోసం మరో అవకాశం కల్పించారు. వికారాబాద్ జిల్లాలోని పరిగి సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో జూలై 6న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి తెలిపారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో మిగిలిన ఖాళీల భర్తీ కోసం ఈ స్పాట్ అడ్మిషన్లు చేపడుతున్నట్లు ఆమె వెల్లడించారు.
ఆసక్తి గల అభ్యర్థులు జూలై 6వ తేదీ ఉదయం 9 గంటలకు పరిగిలోని సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలకు హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులు తమతో పాటు అసలు విద్యార్హత ధ్రువపత్రాలు, వాటి రెండు సెట్ల జిరాక్స్ ప్రతులు, రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలు తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు. అర్హత గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ రమాదేవి కోరారు.

