ఏఐటీయూసీ జిల్లా 4 వ మహాసభని జయప్రదం చేయండి..
- గోరి కొత్త పల్లిలో హమాలీ, ఆటో, బిల్డింగ్ కార్మికులఆధ్వర్యంలో కరపత్రం విడుదల
- ముఖ్య అతిది గా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతారాజు సతీష్
- సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పైండ్ల శాంతి కుమార్
రేగొండ, ఆంధ్రప్రభ : ఈ నెల 12 వ తేదీ న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగే ఏఐటీయూసీ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ స్థానిక గోరికొత్తపల్లి మండలకేంద్రం లో హమాలీ కార్మికులతో కలిసి కరపత్రం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… కార్మిక హక్కుల కోసం నిరంతరం రాజీలేని సమరశీల పోరాటాలు చేస్తూ దేశంలో ఏర్పడ్డ మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ అని 1920 అక్టోబర్ 31న ముంబై నగరంలోని ఏఐటీయూసీ ఆవిర్భావం నుండి నేటి వరకు అనేక పోరాటాల్లో ముందు వరుసలో ఉండి కార్మిక సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు వెళుతూ ఉందన్నారు. నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం పెట్టుబడిదారులకు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా మార్పులు చేస్తూ 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోల్డ్ గా మార్చి కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతుందన్నారు.
కాంట్రాక్ట్ అవుట్ ఫోర్సింగ్ పేరుతో కార్మికులకు తక్కువ వేతనాలు చెల్లిస్తూ వెట్టి చాకిరి చేయిస్తుందన్నారు. కనీస వేతనాలు పిఎఫ్ ఈఎస్ఐ అమలకు నోచుకోవడం లేదని అసంఘటితరంగా కార్మికులకు సమగ్ర చట్టాలు చేయడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. జిల్లాలో ఉన్న కార్మికులందరూ పెద్ద ఎత్తున ఈ జిల్లా మహాసభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ రంగం అధ్యక్షులు పుట్ట సంపత్, హమాలి సంఘం అధ్యక్షులు. వైనాల ఐల్లయ్య, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ పుట్ట రమేష్, సురేష్, క్యాతారాజు తిరుపతి, నగేష్, నాగార్జున్ జగదీశ్, సారంగం, రాజు, రమేష్,శివశంకర్, ఈర్ల రాజు తదితరులు పాల్గొన్నారు.
