జులై 18న చెక్ బౌన్స్ కేసులకు స్పెషల్ లోక్ అదాలత్

  • జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవన్ కుమార్

భూపాలపల్లి రూరల్,ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సమావేశానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జే. జీవన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్.ఐ. యాక్ట్ కింద నమోదైన చెక్ బౌన్స్ కేసుల త్వరిత పరిష్కారం కోసం ఈ నెల 18న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెండింగ్‌లో ఉన్న చెక్ బౌన్స్ కేసులను రాజీ ద్వారా పరిష్కరించేందుకు బ్యాంకు అధికారులు, చిట్‌ఫండ్ కంపెనీల నిర్వాహకులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు.సమావేశంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి. అఖిల, ప్రభుత్వ న్యాయవాది బోట్ల సుధాకర్, అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏ. రాములు తదితరులు పాల్గొన్నారు.