ఘనంగా బీజేపీ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ జన్మదిన వేడుకలు
ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని బీజేపీ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్ జన్మదినోత్సవాన్ని పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కేక్ కట్ చేసి డాక్టర్ కె. లక్ష్మణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన అందిస్తున్న సేవలను కొనియాడుతూ పలువురు నాయకులు ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ కార్యదర్శి కామిటికారి కృష్ణ, ఆలేరు బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ చిరిగె శ్రీనివాస్, ఓబీసీ పట్టణ మోర్చా అధ్యక్షుడు ఎగ్గిడి సంపత్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు వడ్డెమాన్ నరేందర్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు పూల హనుమంతు, మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు కంతుల శంకర్, పట్టణ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కళ్లెం రాజు, కంటెస్టెడ్ కౌన్సిలర్, యువనేత చిలుకూరి శాంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
