ఫెర్టిలిటీ సేవల విస్తరణకు ఆదేశాలు….

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన ప్రజనన ఆరోగ్య సేవలు అందించేందుకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కీలక నిర్ణ‌యం తీజుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫర్టిలిటీ సేవలను విస్తరించాలని ఆదేశాలు జారీ చేశారు. అనుభవజ్ఞులైన గైనకాలజిస్టులను నియ‌మించి ప్రత్యేక ఫర్టిలిటీ ఓపీ (OP) క్లినిక్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో శుక్రవారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి ఈ ఆదేశాలు ఇచ్చారు.

రాష్ట్రంలో అనుభవజ్ఞులైన ప్రభుత్వ గైనకాలజిస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారి నైపుణ్యాన్ని సంతానలేమి చికిత్సల్లో సమర్థంగా వినియోగించాలని మంత్రి సూచించారు. ఆసక్తి ఉన్న గైనకాలజిస్టులు వారానికి కనీసం ఒక రోజు ప్రత్యేక ఫెర్టిలిటీ ఓపీ నిర్వహించాలని ఆదేశించారు.

గాంధీ, పేట్లబుర్జ్ IVF కేంద్రాల్లో మంచి ఫలితాలు

2024లో గాంధీ ఆసుపత్రి, పేట్లబుర్జ్ ఆసుపత్రుల్లో ప్రారంభించిన IVF కేంద్రాల పనితీరును మంత్రి సమీక్షించారు. ఈ కేంద్రాల్లో ఇప్పటివరకు సుమారు 37,300 మంది రోగులు ఫర్టిలిటీ సేవలు పొందినట్లు అధికారులు తెలిపారు. 23 మంది మహిళలు IVF చికిత్స ద్వారా గర్భం దాల్చారు, 510 మంది IUI చికిత్స పొందారు.

2024లో గాంధీ ఆసుపత్రి మరియు పెటాలింగ్ జయ ఆసుపత్రిలో ప్రారంభించిన ఐవీఎఫ్ కేంద్రాల పనితీరును మంత్రి సమీక్షించారు. ఈ కేంద్రాలలో ఇప్పటివరకు సుమారు 37,300 మంది రోగులు సంతాన సాఫల్య సేవలను పొందారని అధికారులు తెలిపారు. ఐవీఎఫ్ చికిత్స ద్వారా 23 మంది మహిళలు గర్భవతులవ్వగా, 510 మంది ఐయూఐ చికిత్స పొందారు. ప్రస్తుతం 490 జంటలకు ఐవీఎఫ్ చికిత్స జరుగుతోంది. ఈ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో, గాంధీ ఆసుపత్రి, పెట్ల బురుజ్ ఆసుపత్రి నమూనాలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులలో ఐవీఎఫ్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

జిల్లా ఆసుపత్రులకు సేవల విస్తరణ

ఫర్టిలిటీ సేవలను దశలవారీగా రాష్ట్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులకు విస్తరించాలని మంత్రి ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ప్రైవేట్ ఫర్టిలిటీ కేంద్రాలపై ప్రతి నెలా తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే, అక్రమాలు చేసే లేదా రోగులను దోపిడీ చేసే కేంద్రాలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన, పారదర్శక, నైతిక వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు.

యువతలో అవగాహన పెంచాలి

సంతానలేమి సమస్యలపై యువతలో విస్తృత అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా సంతానలేమికి గల కారణాలు, సరైన సమయంలో వైద్యులను సంప్రదించాల్సిన అవసరం, అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని ఆదేశించారు.

అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ లో (సరోగసి పేరుతో జరిగిన చట్టవిరుద్ధమైన వ్యవహారాలు, పిల్లల అక్రమ రవాణాపై) ఇటీవల వెలుగుచూసిన ఘటనల వంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలోని ప్రతి ఫెర్టిలిటీ కేంద్రాన్ని నెలకు కనీసం ఒక్కసారైనా తప్పనిసరిగా తనిఖీ చేయాలని మంత్రి స్పష్టం చేశారు. చట్టబద్ధ నిబంధనలను ఉల్లంఘించే, అనైతిక విధానాలు అనుసరించే, రోగులను దోపిడీ చేసే ఫెర్టిలిటీ కేంద్రాలపై ఎలాంటి ఉపేక్ష లేకుండా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో, ఫెర్టిలిటీ కేంద్రాల పనితీరు గురించి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ సంగీత సత్యనారాయణ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 464 నమోదిత ఫెర్టిలిటీ కేంద్రాల ఉన్నాయని, వాటిలో 60 కేంద్రాలకు నిబంధనల ఉల్లంఘనలకు గాను షో కాజ్ నోటీసులు జారీ చేశామని ఆమె తెలిపారు. తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన 2 కేంద్రాల లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేసినట్లు ప్రకటించారు. మరో 9 కేంద్రాల లైసెన్సులను సస్పెండ్ చేశారు.

మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ ఫెర్టిలిటీ కేంద్రాల్లో నాణ్యతా ప్రమాణాలు, పారదర్శకత, నైతిక విలువలు తప్పనిసరిగా పాటించేలా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు. రోగులను దోపిడీ చేసే లేదా చట్టాలను ఉల్లంఘించే కేంద్రాలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో క్రిస్టినా జెడ్. చోంగ్తు, డాక్టర్ సంగీత సత్యనారాయణ, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్టీ), సరోగసీ రాష్ట్ర పర్యవేక్షణ మండలి సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.