బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి సన్నిధిలో వేడుకగా పల్లకి సేవ
- భక్తుల జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణం భక్తిరసమయం
ఆంధ్రప్రభ, నిర్మల్ జిల్లా (బాసర) : బాసర జ్ఞానసరస్వతి దేవి అమ్మవారి సన్నిధిలో శుక్రవారం పల్లకి సేవ వేడుకగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, భక్తుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం భక్తి భావంతో ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక వాతావరణంలో ముంచెత్తింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పల్లకి సేవలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సేవలను సజావుగా నిర్వహించినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.
