కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళ యాక్టర్ యోగి బాబు..
ఇంద్రకీలాద్రి ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువైన కనకదుర్గమ్మ వారిని తమిళ హాస్య నటుడు యోగిబాబు దర్శించుకున్నారు. శుక్రవారం ఇంద్రకీలాద్రి కి వచ్చిన ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లను ఏర్పాటు చేశారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు వేదాసరించడం చేయగా ఏఈఓ గంగాధర్ సూపర్డెంట్ జగదీష్ లు అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు. అభిమాన హాస్య నటుడిని చూసినా కొంతమంది అభిమానులు ఆయనతో సెల్ఫీ దిగారు.
