4న పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత
మరమ్మత్తు పనుల నేపథ్యంలో వినియోగదారులు సహకరించాలని ఈఈ మధుకుమార్ విజ్ఞప్తి
నర్సాపురం, ఆంధ్రప్రభ : లేసు పార్క్ ఫీడర్, 11 కేవీ టౌన్-2, సీతారామపురం ఫీడర్లలో ట్రీ కటింగ్, మరమ్మత్తు పనులు చేపట్టనున్నందున శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు నర్సాపురం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. మధుకుమార్ తెలిపారు.
మరమ్మత్తు పనుల కారణంగా పట్టణ పరిధిలోని రుస్తుంబాదా పరిసర ప్రాంతాలు, హౌసింగ్ బోర్డు కాలనీ, వీవర్స్ కాలనీ, కొల్లబత్తులవారి మెరక, కృష్ణబాబు కాలనీ, మంగినవారి కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు చెప్పారు. అలాగే మండలంలోని లక్ష్మణేశ్వరం, రాజులలంక, దర్భరేవు, మర్రితిప్ప గ్రామాల్లో కూడా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు.
పట్టణ ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మరమ్మత్తు పనులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ముందస్తుగా ప్రజలకు తెలియజేస్తున్నామని, ఆయా ప్రాంతాల విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. మధుకుమార్ కోరారు.
