మెరుగైన వైద్యం కోసం ఎల్ఓసిలు అందజేత ..
భవానిపురం, ఆంధ్రప్రభ : ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ ఓ సీ లను ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి అందజేశారు. 40 వ డివిజన్ , భవానీపురం కు చెందిన షేక్ మొహిద్దిన్ (51) యూరినల్ గాల్ స్టోన్ సమస్యతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు అతనికి మెరుగైన వైద్యం అందించాలని శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు తెలపడంతో ఎన్డీఏ కార్యాలయంలో వైద్యం సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ. 4 లక్షల 60 వేల ఎల్ ఓ సీ ను బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.
41వ డివిజన్, రంగూన్ సాహెబ్ వీధికి చెందిన మహమ్మద్ నజ్మా ( 20) రోడ్డు ప్రమాదంలో కాలికి గాయమావగా మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ కొరకు దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ. 1లక్ష 35 వేల ఎల్ ఓ సీ ను అందజేశారు. త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ ను అందజేయడంతో బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా కు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి నేతలు నాగోతి రామారావు,పీవీ చిన సుబ్బయ్య, తారిక్ అజీజ్, బీ దుర్గా ప్రసాద్, గడ్డిపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు..
