అడ్వోకేట్‌ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి..

నర్సాపురంలో న్యాయవాదుల నిరసన

న్యాయవాదులపై పెరుగుతున్న దాడుల నేపథ్యంలో రక్షణ చట్టం అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

నర్సాపురం, ఆంధ్రప్రభ: అడ్వోకేట్‌ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నర్సాపురం బార్ అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం నర్సాపురం కోర్టు ఆవరణలో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అడ్వోకేట్‌ రక్షణ చట్టం అమల్లో ఉందని, అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ చట్టాన్ని వెంటనే అమలులోకి తీసుకురావాలని కోరారు.

న్యాయవాదులపై దాడులు, హత్యలు పెరుగుతున్న నేపథ్యంలో వారి భద్రత కోసం ప్రత్యేక రక్షణ చట్టం అమలు చేయాల్సిన అవసరం ఉందని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నెక్కంటి క్రాంతికుమార్, పలువురు సీనియర్ న్యాయవాదులు డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో న్యాయవాదులు గన్నాబత్తుల వల్లభారావు, కొత్తపల్లి రమేష్, కానూరి బుజ్జి, పుప్పాల కృష్ణ, చేగొండి బాలాజీ, వైదానీ నాగేశ్వరరావు, రంజిత్, జి. శివాజీ, చక్రవర్తి వినోద్, ప్రవీణ్, బొలిశెట్టి నవీన్, శిరీష, చాముండేశ్వరి, సైమన్ కరుణానిధి, వెంకటేశ్వరరావు, నమో, దొంగ నరసింహరాజు, బోల్ల విశ్వేశ్వరరావు, మల్లెడి కాశీ తదితరులు పాల్గొన్నారు.