Ronaldo-Goal : పొర్చుగల్​ హైవోల్టేజీ.. Andhra Prabha Sports Story

Ronaldo-Goal : పొర్చుగల్​ హైవోల్టేజీ.. Andhra Prabha Sports Story

  • రొనాల్డో క్లినికల్​ టచ్​
  • 4-1 తేడాతో క్రొయేషియాపై విజయం
  • రౌండ్​ 16లో బెర్త్​ కైవశం

( ఆంధ్రప్రభ, క్రీడాప్రతినిధి )

కెనడాలోని టొరంటోలో బిఎమ్‌ఓ ఫీల్డ్ స్టేడియంలో… పోర్చుగల్ , క్రొయేషియా మధ్య శుక్ర వారం తెల్లవారుజామున హై-వోల్టేజ్ నాకౌట్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. క్రిస్టియానో రొనాల్డో, లూకా మోడ్రిచ్​ ముఖాముఖి పోరులో 4-1 గోల్స్​ తేడాతో క్రొయేషియాపై పోర్చుగల్ ఘన విజయం సాధించింది. రౌండ్ ఆఫ్ 16కు దూసుకెళ్లింది.

Ronaldo-Goal : ఆది నుంచి.. డిఫెన్స్​ అటాక్​ ..

మొదటి అర్థ భాగంలో ఇరు జట్లు హోరాహోరీగా తలబడ్డాయి. తొలి 05వ నిమిషంలో కొద్దిసేపటికే పోర్చుగల్​ స్ట్రయికర్​ రాఫెల్ లెయావ్ అందించిన పాస్‌తో బ్రూనో ఫెర్నాండెజ్ గోల్ కోసం ప్రయత్నించాడు. కానీ క్రొయేషియా గోల్‌ కీపర్ డొమినిక్ లివాకోవిచ్ అద్భుతంగా అడ్డుకున్నాడు. ఇక 17వ నిమిషంలో క్రొయేషియా ఆటగాడిని ఫౌల్ చేసినందుకు పోర్చుగల్ స్టార్ డిఫెండర్ రూబెన్ డయాస్‌కు అంపైర్ ఎల్లో కార్డ్ చూపించారు. 30వ నిమిషంలో క్రొయేషియా కెప్టెన్ లూకా మోడ్రిచ్ మిడ్‌ఫీల్డ్ నుండి అద్భుత క్రాస్ పాస్ అందించగా, ఆంటె బుడిమిర్ కొట్టిన షాట్ కొట్టగా.. పోర్చుగల్ కీపర్ డియోగో కోస్టా చేతుల్లోకి బాల్​ చేరింది. ఇలా ఇరు జట్లు డిఫెన్స్‌లో పటిష్టంగా నిలబడటంతో ఫస్ట్ హాఫ్ 0-0 తో ముగిసింది.

Ronaldo-Goal : సీన్​ రివర్స్​… వన్​ మ్యాన్​ షో..

55వ నిమిషంలో పోర్చుగల్ వన్-మ్యాన్ షో మొదలైంది. బ్రూనో ఫెర్నాండెజ్ అందించిన పిన్‌పాయింట్ పాస్‌ను రాఫెల్ లెయావ్ డిఫెండర్లను దాటుకుంటూ నెట్‌లోకి పంపి పోర్చుగల్‌కు తొలి ఆధిక్యాన్ని అందించాడు .68వ నిమిషంలో రొనాల్డో మేజిక్ తో పోర్చుగల్ మరో గోల్ కొట్టింది. పెనాల్టీ బాక్స్ వెలుపల నుండి జోయావ్ కాన్సెలో ఇచ్చిన క్రాస్‌ను క్రిస్టియానో రొనాల్డో తన ట్రేడ్‌మార్క్ స్టయిల్​ లో క్లినికల్ ఫినిషింగ్‌తో గోల్‌గా మలిచాడు. ఈ టోర్నమెంట్‌లో రొనాల్డోకు ఇది అత్యంత కీలక గోల్ ఇక .78వ నిమిషంలో క్రొయేషియా డిఫెన్స్ ఒత్తిడిలో తప్పులు చేయగా, బెర్నార్డో సిల్వా అసిస్ట్‌తో విటిన్హా మూడో గోల్ నమోదు చేశాడు. 84వ నిమిషంలో క్రొయేషియా విజృంబించింది. లూకా మోడ్రిచ్ ఫ్రీ-కిక్ ద్వారా అందించిన బంతిని ఇవాన్ పెరిసిచ్ హెడర్ ద్వారా గోల్‌గా మలచి క్రొయేషియా ఖాతాను తెరిచాడు. 92 వ నిమిషంలో ఇన్‌జూరీ టైమ్‌లో క్రిస్టియానో రొనాల్డో డిఫెండర్లను ఏమార్చి అందించిన పాస్‌ను సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ గొంసాలో రామోస్ గోల్‌గా మలిచి విజయానికి ముగింపు పలికాడు. 4 – 1 గోల్స్​ తేడాతో క్రొయేషియా పై పోర్చుగల్ విజయం సాధించి, రౌండ్ ఆఫ్ 16కు చేరడమే కాకుండా, తదుపరి రౌండ్‌లో స్పెయిన్ జట్టుతో తలపడటానికి సిద్ధమైంది. 41 ఏళ్ల రొనాల్డో ఈ మ్యాచ్‌లో అటు గోల్స్, ఇటు అసిస్ట్‌లతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచాడు.