CarAccident | అద్దాలు పగులగొట్టి బయటపడ్డ డ్రైవర్

CarAccident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వీరన్నగుట్ట శివారులో ఇవాళ కారు ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టి, అనంతరం పొలంలోకి దూసుకెళ్లి బోల్తాపడింది.

ప్రమాదం తీవ్రతకు విద్యుత్ స్తంభం విరిగిపోగా, విద్యుత్ వైర్లు కారుపై పడిపోయాయి. దీంతో కారులో చిక్కుకున్న డ్రైవర్ అప్రమత్తంగా అద్దాలను పగులగొట్టి బయటకు దూకి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

సమాచారం అందుకున్న రెంజల్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. విద్యుత్ శాఖ అధికారుల సహాయంతో విద్యుత్ సరఫరాను నిలిపివేసి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.