భారీ డిస్కౌంట్లు.. మిస్ అవొద్దు!

  • అమెజాన్ ప్రైమ్ డే వచ్చేస్తోంది..!

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఆన్‌లైన్ షాపింగ్ కోసం ఎదురుచూసే వినియోగదారులకు అమెజాన్ గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో 10వ ఎడిషన్ అమెజాన్ ప్రైమ్ డే 2026 సేల్‌ను జూలై 4 నుంచి జూలై 6 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. 72 గంటల పాటు కొనసాగే ఈ సేల్‌లో ప్రైమ్ సభ్యులకు మాత్రమే మిగిత వారికంటే ముందుగా ప్రత్యేక ఆఫర్లు, కొత్త ఉత్పత్తుల లాంచ్‌లు, బ్యాంక్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు అందుబాటులో ఉంటాయి.

ప్రైమ్ సభ్యులకే అవకాశం

ఈ సేల్‌లో షాపింగ్ చేయాలంటే తప్పనిసరిగా అమెజాన్ ప్రైమ్ డే మెంబర్‌షిప్ ఉండాలి. సేల్ సందర్భంగా కొత్త సభ్యులకు కూడా ప్రత్యేక ధరల్లో మెంబర్‌షిప్ అందిస్తోంది. వన్‌ ఇయర్‌ ప్రైమ్ ప్లాన్‌ను తక్కువ ధరలో అందించడంతో పాటు ప్రైమ్ లైట్‌, ప్రైమ్ షాపింగ్‌ ఎడిషన్‌ ప్లాన్‌లపై కూడా డిస్కౌంట్లు ప్రకటించింది.

బ్యాంక్ ఆఫర్లు అదిరిపోయేలా..

ప్రైమ్ డే సేల్‌లో ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులు, యాక్పిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డులు అలాగే ఈఎంఐ కొనుగోలుపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. అలాగే అమోజాన్‌ పే ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్ కార్డు వినియోగదారులకు అన్‌లిమిటెడ్ 5% క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంటుంది.

ఏయే విభాగాల్లో భారీ తగ్గింపులు?

ఈసారి ప్రైమ్ డే సేల్‌లో వేలాది ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందించనున్నారు. ముఖ్యంగా… స్మార్ట్‌ఫోన్లు , ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు , స్మార్ట్ టీవీలు, హోమ్ అప్లయెన్సెస్ , హెడ్‌ఫోన్స్, స్మార్ట్‌వాచ్‌లు, ఫ్యాషన్, బ్యూటీ ఉత్పత్తులు కిచెన్, హోమ్ ఎసెన్షియల్స్, గ్రోసరీ వస్తువులు వంటి విభాగాల్లో ఆకర్షణీయమైన ధరలు ఉండనున్నాయి. కొన్ని ఉత్పత్తులపై 80 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు అమెజాన్ తెలిపింది.

500కు పైగా కొత్త ఉత్పత్తుల లాంచ్..

ప్రైమ్ డే సందర్భంగా 500కు పైగా కొత్త ఉత్పత్తులు మార్కెట్లోకి రానున్నాయి. ప్రముఖ భారతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు తమ కొత్త స్మార్ట్‌ఫోన్లు, గ్యాడ్జెట్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఈ సేల్ ద్వారానే తొలిసారిగా విక్రయానికి తీసుకురానున్నాయి.

స్మార్ట్‌ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లు

వన్‌ ప్లస్‌ (OnePlus), సామ్‌సంగ్‌ (Samsung), ఐక్యూవోవో (iQOO), రెడ్‌ మీ (Redmi) వంటి ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై భారీ ధర తగ్గింపులు ప్రకటించాయి. కొన్ని మోడళ్లపై ఎక్స్చేంజ్ బోనస్, నో-కాస్ట్ ఈఎంఐ , అదనపు బ్యాంక్ డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉంటాయి. అలెక్సా, ఫైర్‌ టీవీ ఉత్పత్తులపై కూడా తగ్గింపు ఉండనుంది.

అమెజాన్ ఈచో స్మార్ట్ స్పీకర్లు, ఫైర్‌ టీవీ స్టిక్‌ , ఈచో షో ,ఫైర్‌ టీవీ ఆధారిత స్మార్ట్ టీవీలపై 45 నుంచి 50 శాతం వరకు తగ్గింపులు ఇవ్వనున్నట్లు సంస్థ వెల్లడించింది.

షాపింగ్ చేసే ముందు గుర్తుంచుకోవాల్సినవి

  • ముందుగానే విష్‌ లిస్ట్‌ (Wishlist) సిద్ధం చేసుకోవాలి.
  • అవసరమైన వస్తువులను కార్ట్‌లో ఉంచుకోవడం మంచిది.
  • బ్యాంక్ కార్డు ఆఫర్లను ముందే చెక్ చేసుకోవాలి.
  • డీల్ ప్రారంభమైన వెంటనే కొనుగోలు చేస్తే స్టాక్ అయిపోకుండా ఉంటుంది.
  • ధరలను పోల్చి చూసి కొనుగోలు చేయడం ఉత్తమం.

ప్రైమ్‌ డే సేల్‌లో స్మార్ట్‌ఫోన్ల నుంచి హోమ్ అప్లయెన్సెస్ వరకు వేలాది ఉత్పత్తులపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉండటంతో, ఈ ఏడాది కూడా దేశవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులు ఈ షాపింగ్ ఫెస్టివల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.