దోమల కాటు వ్యాదులపై అప్రమత్తంగా ఉండాలనిడిఎంహెచ్ఓ అనిత
డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలు
శ్రీకాకుళం, ఆంధ్రప్రభభ : దోమల కాటు ద్వారా వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కే అనిత తెలిపారు . బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం నుండి ఏడు రోడ్ల జంక్షన్ వరకు డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాల పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఏడు రోడ్ల కూడలి వద్ద మానవ హారంలో దోమల నివారణ పై ప్రతిజ్ఞ చేశారు.
ఈ ర్యాలీ ద్వారా ప్రజలకు దోమకాటు ద్వారా వచ్చు వ్యాధులు గురించి, నివారణ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం జిల్లా మలేరియా అధికారి పి.వి. సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఐఓ, ఎపిడిమాలజిస్ట్, ఎఎన్ఎంలు, ఆషా వర్కర్స్, తదితరులు పాల్గొన్నారు.
