హరీష్‌రావుకు ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ నాయకులు
పాలకుర్తి, ఆంధ్రప్రభ: మంచిర్యాల పర్యటనకు వెళ్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావుకు బసంత్‌నగర్ టోల్‌ప్లాజా వద్ద బుధవారం బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మిక సంఘం అధ్యక్షుడు కౌశిక్ హరి ఆధ్వర్యంలో హరీష్‌రావును శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా కౌశిక్ హరి మాట్లాడుతూ.. హరీష్‌రావు తెలంగాణ ప్రజల కోసం నిరంతరం కృషి చేసే ప్రజానాయకుడని, ఆయన నాయకత్వం పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని అన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆయన అందిస్తున్న సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కౌశిక్ లత, సిమెంట్ ఫ్యాక్టరీ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మాదాసు శ్రీనివాస్, కార్పొరేటర్ నిమ్మరాజుల రవి, పార్టీ నాయకులు బండారి కిరణ్, బత్తిని సతీష్, కండె స్వామి, ఖాదర్ పాషా, నేరువట్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు.
