ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి
ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహణ
మండల స్థాయి అధికారులు హాజరు: ఎంపీడీవో జయశ్రీ
చిట్యాల, ఆంధ్రప్రభ : మండల ప్రజలు ప్రతి సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చిట్యాల ఎంపీడీవో టి. జయశ్రీ కోరారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని అన్ని శాఖలకు చెందిన అధికారులు కార్యక్రమానికి హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు. మండల ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో జయశ్రీ కోరారు.
