ప్రముఖ వైద్యులు ప్రభాకర్ కు సన్మానం
ప్రముఖ వైద్యులు ప్రభాకర్ కు సన్మానం
ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన ప్రముఖ వైద్యులు కె ప్రభాకర్ ను డాక్టర్స్ డే ను పురస్కరించుకొని మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ బుధవారం సన్మానించారు. మరో ప్రముఖ వైద్యులు ఎం ప్రతాప్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ స్వప్న రాథోడ్ ను చైర్మన్ బాలమణి భాస్కర్ శాలువాలు కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వైద్యుల సేవలను ఆమె కొనియాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు వానరాశి మరియమ్మ మార్క్, యాట శివ, పస్తం అంజనేయులు, జూకంటి సంపత్, మల్లెల సరిత శ్రీకాంత్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కట్టెగొమ్ముల సాగర్ రెడ్డి పాల్గొన్నారు.
