Dausa Bus Crash | ఎనిమిది మంది సజీవదహనం
Dausa Bus Crash | ఎనిమిది మంది సజీవదహనం
Dausa Bus Crash | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో దిల్లీ–ముంబయి ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సును వెనుక నుంచి ట్రక్కు బలంగా ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ విషాద ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, 15 మందికి పైగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అనంతరం గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఈ బస్సు ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ నుంచి మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌కు వెళ్తుండగా దౌసా జిల్లా పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ట్రక్కు అధిక వేగంతో వచ్చి బస్సును ఢీకొట్టినట్లు తెలుస్తోంది.

