సైడ్ కాలువలు లేక దుర్భర పరిస్థితి..

సర్పంచ్‌పై గ్రామస్థుల ఆగ్రహం

కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ: కన్నాయిగూడెం మండలంలోని గూర్రెవుల గ్రామంలో సైడ్ కాలువలు లేకపోవడంతో వర్షపు నీరు నిల్వ ఉండి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగు నీరు నిల్వ ఉండటంతో దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ సమస్యను పలుమార్లు గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజల సమస్యలను పూర్తిగా గాలికొదిలేశారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంటనే సైడ్ కాలువల నిర్మాణం చేపట్టి నిల్వ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.