LENIN Trailer | అఖిల్ ‘లెనిన్’ ట్రైలర్ విడుదల..

మాస్ అవతార్‌లో అదరగొట్టిన అక్కినేని హీరో!

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ సినిమా ట్రైలర్‌ను విడుదలైంది. ఇప్పటికే పోస్టర్లు, టీజర్‌తో అంచనాలు పెంచిన మేకర్స్.. తాజాగా విడుదలైన ట్రైలర్‌తో సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు.

ట్రైలర్‌ను పరిశీలిస్తే.. గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అఖిల్ ఈ సినిమాలో గత చిత్రాలకు భిన్నంగా మాస్ లుక్‌లో కనిపించగా, యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగాలు, డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. హీరో-విలన్ మధ్య సంఘర్షణతో పాటు కుటుంబ బంధాలకు కూడా కథలో ప్రాధాన్యం ఇచ్చినట్లు ట్రైలర్‌లో స్పష్టమవుతోంది.

భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మురళీకిషోర్ అబ్బూరి దర్శకత్వం వహించగా, థమన్ సంగీతం అందించారు. నిర్మాణ విలువలు, విజువల్స్ కూడా ట్రైలర్‌లో ఆకట్టుకునేలా ఉన్నాయి. ట్రైలర్ విడుదలైన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. అఖిల్‌కు ఈ సినిమా బలమైన కంబ్యాక్ అవుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. జూలై 10న ‘లెనిన్’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.