ఉద్యోగరీత్యా సేవలందిస్తేనే గుర్తింపు..
- జిల్లా మార్కెటింగ్ మేనేజర్ షాబోద్దీన్..
జన్నారం, ఆంధ్రప్రభ : ఉద్యోగరీత్యా సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగులకు తప్పకుండా గుర్తింపు లభిస్తుందని జిల్లా మార్కెటింగ్ అధికారి షాబోద్దీన్ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ సూపర్వైజర్, ఇన్చార్జి కార్యదర్శి పి.రామకృష్ణ మంగళవారం పదవి విరమణ చేశారు.ఈ సందర్భంగా స్థానిక రైతు వేదికలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో రామకృష్ణ దంపతులకు పలువురు పూలమాలలు వేసి, శాలువాలు కప్పి సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రామకృష్ణ అటు అధికారులతోనూ ఇటు రైతులతోనూ మమేకమై సేవలందించారన్నారు.
ఉద్యోగరీత్యా మచ్చలేని వ్యక్తిగా అతను పేరు తెచ్చుకున్నాడని ఆయన కొనియాడారు.ఈ కార్యక్రమంలో జన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ మార్కెట్ చైర్మన్,వైస్ చైర్మన్లు లక్ష్మీనారాయణ,ఫసిహుల్ల,పొనకల్ సింగల్ విండో చైర్మన్ అల్లం రవి, ఉమ్మడి జిల్లా యూనియన్ అధ్యక్షుడు నజారోద్దీన్,మాజీ కార్యదర్శి ఆడేల్లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నందునాయక్, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్లు ముత్యం రాజన్న,రాజన్న యాదవ్, సెక్యూరిటీ గార్డుల సంఘం జిల్లా అధ్యక్షుడు బి. భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
