మరిపెడలో విజయవంతంగా ముగిసిన పల్స్ పోలియో కార్యక్రమం

  • ఐదేళ్లలోపు పిల్లలకు 100 శాతం పోలియో చుక్కలు

మరిపెడ, ఆంధ్రప్రభ : మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మూడు రోజుల పాటు నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో మూడో రోజు వైద్య సిబ్బంది క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి మండలంలోని ప్రతి ఇంటిని సందర్శించి ఐదేళ్లలోపు పిల్లలందరికీ 100 శాతం పోలియో చుక్కలు వేయించారు.

కార్యక్రమంలో భాగంగా డాక్టర్ గుగులోతు రవి స్వయంగా అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి పిల్లలకు పోలియో చుక్కలు వేశారా లేదా అనే అంశాన్ని పరిశీలించారు. ఎక్కడైనా చుక్కలు వేయించుకోని (మిస్ అయిన) పిల్లలను గుర్తించి అక్కడికక్కడే పోలియో చుక్కలు వేయించారు.

ఈ సందర్భంగా డాక్టర్ రవి మాట్లాడుతూ, ప్రయాణాల్లో ఉన్న చిన్నారులను దృష్టిలో ఉంచుకుని గత మూడు రోజులుగా స్థానిక బస్టాండ్‌లో ప్రత్యేక పల్స్ పోలియో కేంద్రాన్ని ఏర్పాటు చేసి వారికి కూడా పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ స్వామి, డాక్టర్ వెంకన్న, డాక్టర్ పూజిత, డాక్టర్ కిరణ్ ప్రత్యేక పర్యవేక్షణ చేశారు. పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ మంగమ్మ, సూపర్‌వైజర్లు ఆచార్యులు, లలితకుమారి, వెంకన్న, మాధవి, హెల్త్ అసిస్టెంట్లు వీరయ్య, నర్సయ్య, పల్లె దవాఖానా సిబ్బంది ఝాన్సీ, అఖిల, సతీష్, సరిత, అనిత, సౌజన్య, ఏఎన్‌ఎంలు మంజువాణి, నాగమణి, ఝాన్సీ, రోజమణి, రాములమ్మ, విజయ, హుస్సేన్ బీ, కీర్తి, లలిత, మహిబూబా, అశ్విని, స్వప్న, హరిశ్‌తో పాటు ఆశా కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.