ఘనంగా గువ్వల బాలరాజు జన్మదిన వేడుకలు
- ప్రత్యేక పూజలు, సేవా కార్యక్రమాలతో బాలరాజుకు శుభాకాంక్షలు
- పండ్ల పంపిణీ, అన్నదానంతో మాజీ ఎమ్మెల్యే బర్త్‌డే సెలబ్రేషన్స్
అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గువ్వల బాలరాజు జన్మదిన వేడుకలను బీజేపీ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ఉమామహేశ్వరం పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి ఆయన దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం అచ్చంపేట లింగాల చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. తర్వాత పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి, అచ్చంపేట బస్టాండ్ ప్రాంతాల్లో పండ్లు పంపిణీ చేశారు.

అలాగే స్థానిక అనాథాశ్రమంలో భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మదునాగుల మహేందర్, మంగ్య నాయక్, బాలాజీ, ధర్మా నాయక్, జానకి, టౌన్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్‌తో పాటు శంకర్ మాదిగ, రాకేష్, చందు నాయక్, చింత చందు, రంగినేని రవీందర్, శివచంద్ర, పంబ రాజు, శ్రీను నాయక్, గాలిముడి రామ, అనీల్, అంతటి వెంకటేష్, బోయ రాజు, పరుశరామ్, రవి నాయక్, తిరుపతి యాదవ్, అంజి, జిబిఆర్ సోషల్ మీడియా ఇంచార్జ్ చౌట శివ, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
