collapse | 10మందికి విద్యార్థులకు గాయాలు

collapse | 10మందికి విద్యార్థులకు గాయాలు

collapse | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర రాజధాని ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో మంగళవారం ఉదయం ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. డైమండ్ గార్డెన్ సమీపంలోని 11వ రోడ్డులో విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సుపై ఒక్కసారిగా భారీ చెట్టు కూలిపోయింది.

చెట్టు బలంగా పడటంతో బస్సు పైభాగం తీవ్రంగా దెబ్బతింది. దీంతో బస్సులో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. కొందరు చిన్నారులు బస్సులోనే చిక్కుకుపోగా, సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

ఈ ప్రమాదంలో 10 మందికి పైగా విద్యార్థులు గాయపడినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.