ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి: మహ్మద్ గౌస్
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సహకార సమృద్ధి–సమగ్ర అభివృద్ధి ప్రత్యేక సహకార వారోత్సవాల సందర్భంగా ఉరవకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో జూలై 1న ఉదయం 9 గంటలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘం కార్యనిర్వాహణాధికారి షిలార్ మహ్మద్ గౌస్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమానికి పీఏసీఎస్ చైర్మన్ ప్యారం కేశవానంద, పర్సన్లు కురువ నాగేంద్ర, నాగ ప్రమీలమ్మ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. శిబిరంలో ఆరోగ్య పరీక్షలతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
