బర్రెను ఢీకొన్న బైక్.. దంపతులకు గాయాలు
కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ : కన్నాయిగూడెం మండలం చిట్యాల గ్రామానికి చెందిన దంపతులు మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల గ్రామానికి చెందిన బోచ్చు సుగుణ (50), రవీందర్ (55) ద్విచక్రవాహనంపై చిట్యాల నుంచి కనుకునూరు వెళ్తుండగా లక్ష్మీపురం సమీపంలో ఒక్కసారిగా వాహనం అదుపు తప్పి రోడ్డుపై ఉన్న బర్రెను ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ కిందపడిపోయి గాయపడ్డారు.

ఈ ప్రమాదంలో రవీందర్‌కు స్వల్ప గాయాలు కాగా, సుగుణకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం సమీప ఆసుపత్రికి తరలించారు.
ఈ సేవల్లో ఈఎంటీ జనగాం మహేశ్వరి, పైలట్ ఎ. సతీష్ పాల్గొన్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
