ఉద్యానవన పంట సాగుపై ద్రుష్టి సాధించాలి: ఏపీడి నాగవర్ధన్
దస్తూరాబాద్, ఆంధ్రప్రభ : మండలం లోని అకొండపేట, పెర్కపల్లె లో గ్రామాల్లో అదనపు పీడీ నాగవర్ధన్ పర్యటన చేశారు. ఈ సందర్బంగా ఆయన . ఉద్యవన పంట సాగు పై రైతులు ద్రుష్టి సారించాలని రైతులకు అవగాహన కల్పించారు.. అలాగె ప్రతి ఇంటీ ఆవరణలో ఇంకుడు గుంతలు, మరుగుదొడ్లు తప్పకుండ నిర్మించుకోవాలనీ సూచించారు. తద్వారా రానున్న రోజుల్లో వర్షాలు సమృద్ధిగా లేకపోతే ఇబ్బంది లేకుండా ఉండటానికి దోహదపడతాయని తెలిపారు. ఇందులో అకొండపేట సర్పంచ్ జాడి మాధవి శంకర్, పెర్కపల్లె సర్పంచ్ బోడకుంటి నరేష్,వార్డ్ సభ్యులు రైతులు తదితరులు ఉన్నారు.
