Pawan Kalyan | పవన్ కల్యాణ్‌కు బండ్ల గణేశ్ ఎమోషనల్ పోస్ట్

Pawan Kalyan | పవన్ కల్యాణ్‌కు బండ్ల గణేశ్ ఎమోషనల్ పోస్ట్

Pawan Kalyan | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముంబైలో భుజానికి శస్త్రచికిత్స చేయించుకుంటున్న నేపథ్యంలో నిర్మాత బండ్ల గణేశ్ చేసిన భావోద్వేగ సోషల్ మీడియా పోస్టు వైరల్‌గా మారింది. పవన్ కల్యాణ్ త్యాగం, నిబద్ధతను గుర్తుచేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానులను కదిలిస్తున్నాయి.

బండ్ల గణేశ్ తన పోస్టులో ‘గబ్బర్ సింగ్’ సినిమా చిత్రీకరణ సమయంలోనే పవన్ కల్యాణ్ భుజానికి తీవ్ర గాయం అయిందని తెలిపారు. వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచించినప్పటికీ, సినిమా ఆగిపోతే నిర్మాతకు భారీ నష్టం వాటిల్లుతుందనే ఆలోచనతో పవన్ ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారని పేర్కొన్నారు. నిర్మాతకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో దాదాపు 15 ఏళ్ల పాటు నొప్పిని భరిస్తూ పని చేశారని ఆయన వెల్లడించారు.

ఒక నిర్మాత కోసం 15 సంవత్సరాల పాటు నరకం అనుభవించాడు. ఇప్పుడు ఆ భుజానికి శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి వ్యక్తిని ఎంత అభిమానించినా తక్కువే. దేవుడు ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను అంటూ బండ్ల గణేశ్ భావోద్వేగంగా రాసుకొచ్చారు.

ముంబైలోని వైద్యుల సూచన మేరకు పవన్ కల్యాణ్ భుజానికి శస్త్రచికిత్స చేయించుకుంటున్నారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని, వైద్యుల పర్యవేక్షణలో ఆయన కోలుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అభిమానులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా సందేశాలు పంపుతున్నారు.