ఘనంగా రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు..
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని జగన్నాధపూర్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు, ఎల్లమ్మ తల్లి కమిటీ సభ్యులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
