రేపే బాబ్లీగేట్ల ఎత్తివేత..

  • నీరులేక వెలవెల బోతున్న ఎస్సారెస్పీ ప్రాజెక్టు
  • వర్షాలు కురిస్తేనే వరద వచ్చేది..

బాల్కొండ, ఆంధ్రప్రభ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ భాగాన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బుధవారం ఎత్తడానికి ఇరు రాష్ట్రాల అధికారులు సిద్ధమవుతున్నారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్ సమీపంలో బాబ్లీ ప్రాజెక్ట్ ను నిర్మించింది.సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీన గేట్లను ఎత్తి, అక్టోబర్ 28న మూసి వేయాలి. అంతే కాకుండా మహా రాష్ట్ర పరిసర ప్రాంతాల్లో నిలిచిన నీటికి బదులుగా మార్చి 1న బాబ్లీ గేట్లు ఎత్తి 0.6 టీఎం సీల నీటిని ఎస్సారెస్పీకి అందించాలని తీర్పులో పేర్కొన్నారు. ఎస్సారెస్పీ లోకి ఇప్పటివరకు 1 టీఎంసీ నీరు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.గేట్ల ఎత్తివేత కార్యక్రమంలో ఎస్సారెస్పీ ఏఈఈ లు కొత్త రవి,విన్యాస్ తో పాటు ప్రాజెక్టు అధికారులు పాల్గొననున్నారు.