మోత్కూర్ చేనేత సహకార సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

మోత్కూర్, ఆంద్రప్రభ : మోత్కూర్ లోని చేనేత సహకార సంఘానికి ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం స్థానిక చేనేత సహకార సంఘ భవనంలో చేనేత సహకార సంఘ నోటిఫికేషన్ ఎన్నికల అధికారి సయ్యద్ సుజాత్ అలీ విడుదల చేశారు .ఈ సందర్భంగా ఎన్నికల అధికారి అలీ మాట్లాడుతూ జూలై 2 ,3, 4 తేదీలలో నామినేషన్ ప్రక్రియ , జులై 5 న నామినేషన్ల ఉపసంహరణ, జులై 6న గుర్తుల కేటాయింపు, జులై 10 న ఎన్నికలు నిర్వహించి , అదే రోజు ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మోత్కూర్ చేనేత సహకార సంఘం అధ్యక్షులు జల్ది రాములు , సంఘం మేనేజర్ వేముల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.