కల్వల జెడ్పీహెచ్‌ఎస్‌లో సోషల్ ఆడిట్ తనిఖీలు..
కేసముద్రం, ఆంధ్రప్రభ : కేసముద్రం మండలం కల్వల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ ఆడిట్ తనిఖీ కార్యక్రమం రీసెర్చ్ సూపర్వైజర్ సంపత్ రావు ఆధ్వర్యంలో, ఇన్వెస్టిగేటర్ చింతల శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించబడింది. తనిఖీ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం, పరిశుభ్రత, పాఠశాల నిర్వహణ తదితర అంశాలను సోషల్ ఆడిట్ బృందం క్షుణ్ణంగా పరిశీలించింది.
పాఠశాలలో కొనసాగుతున్న విద్యా కార్యక్రమాలు, పరిపాలనా విధానాలపై సంతృప్తి వ్యక్తం చేసిన బృందం, విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందించేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించింది.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యా యులు బండారు నరేందర్ మాట్లాడుతూ పాఠశాలలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, విద్యా ఫలితాలు, ప్రభుత్వ పథకాల అమలు, విద్యార్థుల సంక్షేమ చర్యల గురించి వివరించారు.
సోషల్ ఆడిట్ బృందం చేసిన సూచనలను సానుకూలంగా స్వీకరించి, వాటి అమలుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం సోషల్ ఆడిట్ బృందం విద్యార్థుల తల్లిదండ్రులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్‌పర్సన్ లింగాల కవిత పిచ్చయ్య, కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో సమావేశమై పాఠశాల పనితీరు, విద్యా నాణ్యత, మౌలిక సదుపాయాలపై అభిప్రాయాలను సేకరించింది.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాచకొండ ఏకాంబరం, భేతి సత్యనారాయణ, తండ సదానందం, వేముల నాగేందర్, మహంకాళి ఏకాంబరం, రాగి బిక్షపతి, వీణవంక రాజేంద్రచారి, బాసాని బాలశౌరి రెడ్డి, ఓడపల్లి రాము, ఫిజికల్ డైరెక్టర్ కొప్పుల శంకర్, ఎం.డి. జుబేర్ అలీ, కారుముచ్చు పార్వతి, కొడారి రాములు, మార్గం శ్రీనివాస్, గడపురం నాగరాజు, ఆవుల లింగయ్య, సీఆర్పీ ఉదయ్, ఎస్. రాధాదేవి, ఎస్. సునీల్, గని లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
