Stock Market Today | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Market Today | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Market Today | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం ప్రారంభంలో ఫ్లాట్‌గా ట్రేడైనా, చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో నష్టాల్లో ముగిశాయి.
ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 372.10 పాయింట్లు (0.48 శాతం) క్షీణించి 76,728.37 వద్ద, నిఫ్టీ 109.75 పాయింట్లు (0.46 శాతం) తగ్గి 23,946.25 వద్ద స్థిరపడింది.
ఈరోజు ట్రేడింగ్‌లో ప్రకాశ్ పైప్స్ లిమిటెడ్, బజాజ్ హెల్త్ కేర్ లిమిటెడ్, మాక్‌పవర్ సీఎన్సీ మెషీన్స్ లిమిటెడ్, సినీవిస్టా లిమిటెడ్, బోరోసిల్ సైంటిఫిక్ లిమిటెడ్ షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి.
మరోవైపు నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్, టార్టిల్మెంట్ ఫిన్స్టిక్ సొల్యూషన్స్ లిమిటెడ్, క్రెబ్స్ బయోకెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, అటల్ రియల్టెక్ లిమిటెడ్, కన్సాలిడేటెడ్ కన్స్ట్రక్షన్ కన్సార్టియం లిమిటెడ్ షేర్లు నష్టాల జాబితాలో నిలిచాయి.
